బాలయ్య-పవన్‌ కళ్యాణ్‌ అన్‌స్టాపబుల్‌ ప్రమో రిలీజ్

January 21, 2023


img

ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2బాలకృష్ణ చాలా రక్తి కట్టిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులని షోకి రప్పించి వారి గురించి సామాన్య ప్రజలకి తెలియని అనేక విషయాలని చెప్పిస్తూ, మద్యలో కవ్వించి ఆడిపాడిస్తూ అన్‌స్టాపబుల్‌ షోని చాలా హుషారుగా సాగిస్తున్నారు. ప్రభాస్‌, గోపీచంద్ ఎపిసోడ్‌ తర్వాత చిరంజీవి వస్తారని ఊహాగానాలు వినిపించాయి కానీ అవి నిజంకావని తేలిపోయింది.

ప్రభాస్‌ తర్వాత పవన్‌ కళ్యాణ్‌తో ఓ ఎపిసోడ్‌ పూర్తి చేశారు. ఆహా ఓటీటీ దాని ప్రమోని విడుదల చేసింది. అయితే దానిలో పవన్‌ కళ్యాణ్‌ అభిమానుల ఓట్లను పొందలేకపోవడం, రాజకీయ ప్రత్యర్ధులతో చేస్తున్న పోరాటానికి సంబందించి బాలయ్య ప్రశ్నిస్తున్నట్లు చూపారు కానీ వాటికి పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానాలు చెప్పారో చూపలేదు.

చివరిగా బాలయ్య షో ముగిస్తూ వియ్ ర్‌ బ్యాడ్ బాయిస్... వన్, టూ త్రీ, ఫోర్, ఫైవ్ అంటూ ముగించిన్నట్లు ప్రమోలో చూపారు. బాలయ్య-పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్‌ జనవరి 26వ తేదీన ప్రసారం కావచ్చాని తెలుస్తోంది.

 


Related Post

సినిమా స‌మీక్ష