వారసుడు... రంజితమే రంజితమే... ఫస్ట్ సింగిల్ అవుట్

November 30, 2022


img

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్‌, రష్మిక మందన జంటగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ‘వారసుడు’ (తమిళంలో వారిసు) సినిమా తొలి లిరికల్ వీడియో సాంగ్ బుదవారం ఉదయం రిలీజ్‌ చేశారు. ‘రంజితమే... రంజితమే...’ అంటూ సాగే ఈ ఫాస్ట్ బీట్ పాటని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా తమన్ దానికి తగ్గట్లు మంచి హుషారైన సంగీతం అందించారు. అనురాగ్ కులకర్ణి, ఎంఎం.మానసి పాడిన ఈ పాటకి విజయ్, రష్మిక మందన బృందం చాలా హుషారుగా డ్యాన్స్ చేశారు. 

వారసుడు చిత్రంలో జయసుధ, ఖుష్బూ, శరత్ కుమార్‌, శ్రీకాంత్, ప్రభు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్, పిరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి కలిసి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే  వంశీ పైడిపల్లి, డైలాగ్స్: శ్రీనివాస్ చక్రవర్తి, స్తంట్స్: రామ్-లక్ష్మణ్, సంగీతం తమన్.            

వారసుడు సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరిలో విడుదలకానుంది. సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలను విడుదల చేయొద్దని చెప్పిన నిర్మాత దిల్ రాజే ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేస్తుండటంపై తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో వివాదం చెలరేగింది. కానీ ఇప్పుడు సద్దుమణిగినట్లే ఉంది.

  Related Post

సినిమా స‌మీక్ష