ప్రభాస్‌-మారుతి ‘రాజా డీలక్స్’ లో మూడో హీరోయిన్‌ ఎవరంటే..

November 28, 2022


img

బాహుబలితో జాతీయస్థాయి నటుడిగా ఎదిగిపోయిన ప్రభాస్‌ ఆ తర్వాత అన్నీ వందల కోట్ల భారీ బడ్జెట్‌ సినిమాలే చేస్తున్నాడు. వందల కోట్లతో తీసిన ‘రాధే శ్యామ్’ ఫ్లాప్ అయినప్పటికీ దర్శకనిర్మాతలు ప్రభాస్‌ మీద నమ్మకం కోల్పోలేదు. దాని తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు రూ.500 కోట్లుభారీ బడ్జెట్‌తో ఆదిపురుష్‌ చేశాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రుతిహాసన్ జంటగా ‘సలార్’ చిత్రం చేస్తున్నాడు. దీని బడ్జెట్‌ సుమారు రూ.200 కోట్లు. ఈ రెండూ కాకుండా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె అనే చిత్రం చేస్తున్నాడు. మూడో ప్రపంచయుద్ధం సంభవిస్తే అనే సరికొత్త కాన్సెప్ట్ తో తీస్తున్న ఈ ప్రాజెక్ట్-కె బడ్జెట్‌ సుమారు రూ.450-500 కోట్లు. అన్నీ వందల కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతుంటే చిన్న బడ్జెట్‌లో సినిమాలు తీసే దర్శకుడిగా పేరొందిన మారుతితో ఓ సినిమా చేయడానికి ప్రభాస్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం విశేషమే కదా?కానీ ఇదీ రూ.100 కోట్ల బడ్జెట్‌లో తీయబోతున్నారు. ప్రభాస్‌ సినిమా అంటే కనీసం రూ.100 కోట్లకి తక్కువ ఉండదన్న మాట! 

మారుతి సినిమాలో కామెడీ ప్రధానంగా ఉంటుందనే సంగతి అందరికీ తెలుసు. వరుసపెట్టి సీరియస్ సినిమాలు చేసుకుపోతున్న ప్రభాస్‌ మద్యలో ఇలాంటి ఓ కామెడీ సినిమా కావాలనే చేస్తున్నట్లు సమాచారం. సిన తర్వాత మారుతి దర్శకత్వంలో ఓ కామెడీ సినిమా చేసేందుకు అంగీకరించడం గొప్ప విషయమే అనుకోవచ్చు. ఈ సినిమాలో ప్రభాస్‌ డబుల్ రోల్ చేస్తున్నాడు. కనుక ఇద్దరు హీరోయిన్లుగా మాళవికా మోహన్, నిధి అగర్వాల్ పేర్లు ఖరారయ్యాయి. అయితే మరో హీరోయిన్‌ కూడా ఉంటుందని, దానికి రిద్ది కుమార్‌ పేరు ఖరారు అయినట్లు తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్‌ తాతగా ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమ్మన్ ఇరానీ చేయబోతున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష