రామ్ చరణ్‌-బుచ్చిబాబు సినిమా ఖరారు

November 28, 2022


img

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఆర్‌సీ-15 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అది పూర్తవక మునుపే ఉప్పెన సినిమా దర్శకుడు బుచ్చిబాబుతో సినిమాకి ఓకే చెప్పేశాడు. వారి సినిమా గురించి సోమవారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. 

ఆర్‌సీ-15 సినిమా తర్వాత గౌతమ్ తిన్నామనూరి దర్శకత్వంలో రామ్ చరణ్‌ సినిమా చేయవలసి ఉంది. కానీ అనివార్య కారాణాల వలన అది నిలిచిపోయింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తాడని వార్తలు వెలువడ్డాయి కానీ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా ఖరారైంది. ఈ సినిమా ప్రకటనలో ‘సుకుమార్ రైటింగ్స్’ అని పేర్కొన్నారు. అంటే ఈ సినిమా కధకి సుకుమార్ కూడా తోడ్పాటు అందించినట్లు అర్దమవుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, కొత్తగా ప్రారంభించిన వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్: 1 గా వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన వివరాలు ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు. 

రామ్ చరణ్‌ ఈ సినిమా ఖరారైనట్లు తెలియజేస్తూ బుచ్చిబాబు బృందంతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నానని ట్వీట్ చేశారు. Related Post

సినిమా స‌మీక్ష