రాహుల్ రామకృష్ణ ఇంటింటి రామాయణం టీజర్‌

November 25, 2022


img

రాహుల్ రామకృష్ణ ప్రదానపాత్రలో ‘ఇంటింటి రామాయణం’ సినిమా టీజర్‌ ఈరోజు విడుదలైంది. నూతన దర్శకుడు సురేష్ నరెడ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించాడు. మారుతి-ఐవివై ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆహా ఓటీటీ సంస్థ నాగ వంశీతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాలో నరేష్, నవ్యస్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇది ఓ పల్లెటూరిలో జరిగే ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమాని తీశారు. డిసెంబర్‌ 16వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో నేరుగా ప్రసారం కాబోతోంది. ఇప్పుడు పలు ఓటీటీ సంస్థలే నేరుగా తక్కువ బడ్జెట్‌లో ఇటువంటి సినిమాలు తీస్తుండటంతో నూతన నటీనటులకి, కధ, మాటలు, పాటల రచయితలకి, దర్శకులు, ఇతర టెక్నీషియన్స్‌కి కూడా తమ ప్రతిభ చాటుకొనేందుకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఇది రాహుల్ రామకృష్ణ సినిమా... దానికి ఇంటింటి రామాయణం పేరువిన్నప్పుడే మంచి కామెడీ ఉంటుందని అర్దమైపోయింది. టీజర్‌ కూడా అదే చెపుతోంది. Related Post

సినిమా స‌మీక్ష