అమెజాన్ ప్రైమ్‌లో కాంతారా... రేపటి నుంచే

November 23, 2022


img

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన కాంతారా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తీసిన కాంతారా ఏకంగా రూ.400 కోట్లు బిజినెస్ చేయడం గమనిస్తే ఆ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో అర్దం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తున్న కాంతారా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఓటీటీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ ఫలించబోతోంది. రేపు అంటే గురువారం నుంచి అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీలో ప్రసారం కాబోతోంది. 

ఈ సినిమా కధ, కధనం, కెమెరా, సంగీతం, అన్నిటికంటే ముఖ్యంగా రిషబ్ శెట్టి నటన, దర్శకత్వం, చివరిగా పాట అన్నీ సినిమాను మరో స్థాయిలో నిలిపాయి.  

కధేమిటంటే... ఓ రాజు అడవిలోని ఓ అద్భుతమైన దైవశిలను తీసుకొని దానికి బదులుగా అక్కడి ప్రజలకు ఆ చుట్టుపక్కల ప్రాంతాలను రాసిచ్చేస్తాడు. కానీ ఆ మాట తప్పితే దైవాగ్రహానికి గురవుతారనే షరతు మీద ఆ శిలని తీసుకొంటాడు. ఆ తర్వాత ఆయన కుమారుడు మాట తప్పి ఆ భూములను ఆక్రమించుకొనేందుకు ప్రయత్నించి మరణిస్తాడు. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ మురళి (కిషోర్) ఆ అటవీ ప్రాంతాన్ని సర్వే చేస్తుండగా శివ (రిషబ్ శెట్టి) అతనికి పదేపదే అడ్డుపడుతుంటాడు. అదే సమయంలో రాజవంశీకుల వారసులైన దేవేంద్ర (అచ్యుత్ కుమార్‌) ఆ భూములను తిరిగి దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తుంటారు. చివరికి ఆ ఊరి ప్రజలని భగవంతుడు ఏవిదంగా కాపాడాడు? అనేదే మిగిలిన కధ. ఇటువంటి కధతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఇంతగా  ఆడలేదు. కలక్షన్స్‌ వసూలు చేయలేదు కూడా. 


Related Post

సినిమా స‌మీక్ష