గాడ్ ఫాదర్‌ రెండో సాంగ్ నజబజ జజర రిలీజ్

September 27, 2022


img

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్‌ సినిమాలోని రెండో సాంగ్ నేడు విడుదల చేశారు. హీరో చిరంజీవి వ్యక్తిత్వాన్ని కీర్తిస్తూ ‘నజబజ జజరా... అడవి తల్లికి అన్నయ్య వీదురా... కలబడితే కధాకళిరా...’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను శ్రీకృష్ణ, పృధ్వీ ఆలపించగా తమన్ సంగీతం సమకూర్చారు. గాడ్ ఫాదర్‌ అక్టోబర్‌ 5వ తేదీన విజయదశమినాడు విడుదలవుతున్నందున ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌ను బుదవారం సాయంత్రం 6 గంటలకు అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించబోతున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్‌ సినిమాను రామ్ చరణ్‌, ఆర్‌బీ.చౌదరి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.

ఈ సినిమాలో బాలీవుడ్‌ హీరో సల్మాన్ ఖాన్ చిరంజీవికి బాడీ గార్డుగా నటించారు. అయితే అతని పాత్ర ఒక పాట, ఫైటుకే పరిమితమని సమాచారం. ఈ సినిమాలో సత్యదేవ్, సునీల్, దీవి వద్యా, దర్శకుడు పూరీ జగన్నాథ్ ఓ జర్నలిస్టుగా నటిస్తున్నారు. గాడ్ ఫాదర్‌ సినిమాకి ధమన్ సంగీతం, కెమెరా వర్క్స్ నీరావ్ షా అందించారు.Related Post

సినిమా స‌మీక్ష