చిరంజీవి, బాలకృష్ణ మాత్రమే అడిగారు... మిగిలినవాళ్ళు మోసం చేశారు

September 27, 2022


img

విలక్షణ నటుడు శ్రీహరి 2009లో హటాత్తుగా మరణించారు. అప్పటి నుంచి సినీ పరిశ్రమలో ఎవరూ తమని పలకరించలేదని శ్రీహరి భార్య శాంతి చెప్పారు. 

ఇటీవల ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ, “బావ (శ్రీహరి)కి సినిమాలంటే చాలా పిచ్చి. అందుకే ఎవరు అడిగినా కాదనకుండా చేసేవారు. కానీ పారితోషికం గురించి గట్టిగా అడిగేవారు కారు. దీంతో చాలామంది ఆయనను వాడుకొని వదిలేశారు. ఎప్పుడైనా మాకు ఎదురుపడితే మేము ఎక్కడ డబ్బు అడుగుతామో అని మొహం చాటేసి వెళ్లిపోతుంటారు. ఒకవేళ బావ పారితోషికం విషయంలో ఖచ్చితంగా ఉండి ఉంటే మాకు కూడా పది బంగళాలు, భారీగా బ్యాంక్ బ్యాలన్స్ ఉండేవి.   

చిరంజీవిగారికి చెందిన సంస్థ, మరో రెండు సంస్థలు మాత్రం బావ చేసిన ప్రతీ సినిమాకి పూర్తిగా డబ్బు చెల్లించేవి. బావ చనిపోయే ముందు బాలకృష్ణ సినిమాలో ఓ చిన్న పాత్రలో బావ నటించారు. అప్పుడు బాలకృష్ణే స్వయంగా నాకు ఫోన్‌ చేసి మేము మీవారికి ఏమైనా సొమ్ము బాకీ ఉన్నామా?ఉంటే చెప్పమని అడిగారు. కానీ అప్పటికే ఆ సొమ్ము వారు చెల్లించేశారు. అయినా బాలకృష్ణగారు ఫోన్‌ చేసి అడిగారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా తనకు ఫోన్‌ చేయమని బాలకృష్ణ మాకు ఎంతో ధైర్యం చెప్పారు. 

బావ చనిపోయిన తర్వాత అయినా నిర్మాతలు పారితోషికం మాకు ఇచ్చి ఉంటే మేము మా ఇంటి మీద అప్పు తీర్చుకోవడానికి నా నగలు, కారు అమ్ముకోవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఎవరూ ఒక్క పైసా కూడా చెల్లించలేదు,” అని శాంతి ఆవేదన వ్యక్తం చేశారు. Related Post

సినిమా స‌మీక్ష