ఛార్టడ్ విమానంలో చిరు... శ్రీముఖి ఇంటర్వూ

September 24, 2022


img

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య దెబ్బ నుంచి త్వరగానే కోలుకొని గాడ్ ఫాదర్‌ పూర్తి చేసేశారు. మోహన్ రాజా దర్శకత్వంలో సిద్దమైన ఈ సినిమా అక్టోబర్‌ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిరంజీవిని ఛార్టడ్ విమానంలో ప్రయాణిస్తుండగా యాంకర్ శ్రీముఖి ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ‘ఆడియో క్లిప్పింగ్’ ‘నేను రాజకీయానికి దూరం అయ్యానే కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు’అనే డైలాగ్ ఆయన చేత మరోసారి చెప్పించింది. 

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో కేవలం ఫ్రెండ్లీగా చేశాడని చిరంజీవి చెప్పారు. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాలో జర్నలిస్టుగా కనిపిస్తాడని చిరంజీవి చెప్పారు. మొదట నటించడానికి ఒప్పుకోలేదని కానీ తానే ఒప్పించానని చిరంజీవి చెప్పారు. పూరీ జగన్నాథ్ దర్శకుడు అయినప్పటికీ అతనిలో మంచి కమాండింగ్ ఉన్న నటుడున్నాడని చిరంజీవి ప్రశంసించారు. 

ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ఆరో ప్రాణం వంటిదని చిరంజీవి చెప్పారు. హీరోయిన్స్, సాంగ్స్ అనే ఆలోచన లేకుండా ఉండే గొప్ప సబ్జెక్ట్ ఉన్న కధ ఇది. గాడ్ ఫాదర్‌ ఒక నిశబ్ద విస్పోటనం వంటిదని చిరంజీవి చెప్పారు. Related Post

సినిమా స‌మీక్ష