త్వరలో మెగా కుటుంబానికి మెగా వారసుడు?

September 23, 2022


img

మెగా స్టార్ చిరంజీవి వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ అన్ని విధాలా తండ్రికి తగ్గ తనయుని నిరూపించుకొన్నారు. ఓ పక్క సినిమాలలో నటిస్తూనే మరోపక్క నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. కానీ ఉపాసనతో పెళ్ళయి పదేళ్ళు గడిచినా ఇంతవరకు మెగా కుటుంబంలో వారసుడు రాకపోవడం ఖచ్చితంగా ఓ లోటే. 

మెగా వారసుడి కోసం చిరంజీవి దంపతులు, కుటుంబ సభ్యులే కాదు... మెగా అభిమానులు కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇన్నేళ్ళకి ఆ శుభవార్త వినిపించబోతోంది. ఉపాసన ప్రస్తుతం రెండు-మూడు నెలల గర్భవతి అనే విషయం సినీ పరిశ్రమలో లీక్ అయింది. అది సోషల్ మీడియాలోకి వచ్చేయడంతో మెగా అభిమానులు అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో మాత్రం అప్పుడే ఈ విషయం గురించి అందరూ మాట్లాడుకొంటున్నారు. కానీ ఉపాసనకు నాలుగో నెల నిండే వరకు ఈ వార్తను బయటకి తెలియకుండా ఉంచాలని మెగా ఫ్యామిలీ భావిస్తోంది కనుక ఈ వార్తను ఎవరూ దృవీకరించడం లేదు. కనుక వారి కుటుంబం అధికారికంగా ఈ విషయం ప్రకటించేవరకు సంతోషం కలిగించే ఊహాగానంగానే దీనిని సరిపెట్టుకోకతప్పదు. 


Related Post

సినిమా స‌మీక్ష