గాడ్ ఫాదర్‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ఎక్కడంటే...

September 20, 2022


img

మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటించిన గాడ్ ఫాదర్‌ సినిమా దసరా పండగ సందర్భంగా అక్టోబర్‌ 5వ తేదీన విడుదల కాబోతోంది. కనుక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ని ఈనెల 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు అనంతపురం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు మొదలయ్యాయని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. 

మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్‌ సినిమాను రామ్ చరణ్‌, ఆర్‌బీ.చౌదరి కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫర్ చిత్రానికి ఇది తెలుగు రీమేక్.

ఈ సినిమాలో బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్, సత్యదేవ్, సునీల్, దీవి వద్యా నటిస్తున్నారు. గాడ్ ఫాదర్‌ సినిమాకి ధమన్ సంగీతం, కెమెరా వర్క్స్ నీరావ్ షా అందించారు.


Related Post

సినిమా స‌మీక్ష