గాడ్ ఫాదర్ ఫస్ట్ సింగిల్ వచ్చేసిందోచ్

September 15, 2022


img

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో మొదటి సాంగ్‌ ఈరోజు విడుదలైంది. కానీ వీడియో కాకుండా ఆడియో మాత్రమే రిలీజ్ చేశారు. దానిని 'స్పాటిఫై మ్యూజిక్ సైటులో పెట్టారు. తార్ మార్ తాకార్ మార్ అంటూ సాగే ఈ పాటకు ప్రమోలో చిరంజీవితో కలిసి బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డ్యాన్స్ చేశాడు. అనంత్ శ్రీరామ్ వ్రాసిన పాటను శ్రేయా గోషల్ చాలా హుషారుగా పాడగా దానికి తమన్ సంగీతం అందించారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు కలిసి చేసిన ఈ డ్యాన్స్‌ను ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కంపోజ్ చేశారు. అయితే ఈ పాట కంపోజిషన్, మ్యూజిక్ రెండూ కూడా పాత వాసనలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో తమన్‌పై అప్పుడే ట్రోలింగ్ మొదలైంది. అయితే ఈ పాటలో మెగాస్టార్ హుషారుగా చేసిన డ్యాన్స్ చూసి మెగా అభిమానులు చాలా పొంగిపోతున్నారు.      

మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసీఫార్ చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార నటిస్తోంది. గాడ్ ఫాదర్‌ను హిందీలో కూడా రిలీజ్ చేయబోతున్నందున ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా తీసుకొన్నారు. కానీ అతను కేవలం అతిధి పాత్ర చేస్తున్నాడు. సత్యదేవ్, సునీల్, దీవి వద్యా నటిస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి తల్లిగా గంగవ్వ, అతిధి పాత్రలో దర్శకుడు పూరీ జగన్నాథ్ నటిస్తుండటం మరో విశేషం. రామ్ చరణ్‌, ఆర్‌బీ.చౌదరి కలిసి ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. Related Post

సినిమా స‌మీక్ష