హైదరాబాద్‌లో ర్యాపిడో డ్రైవర్ నుంచి గంజాయి స్వాధీనం!

January 11, 2026
img

హైదరాబాద్‌ పోలీసులు ఓ ర్యాపిడో బైక్ డ్రైవర్ నుంచి 137 గ్రాముల గంజాయి పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. బంజారా హిల్స్‌లో ఓ వ్యక్తీ రహస్యంగా గంజాయి అమ్ముతున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం వచ్చింది.

వెంటనే ఆ ప్రాంతంలో వాహనాలు తనికీలు మొదలుపెట్టగా రోడ్ నం:10లో మహ్మద్ జునైద్ అనే ర్యాపిడో డ్రైవర్‌ని ఆపి తనికీ చేయగా బ్యాగులో గంజాయి ఉందని గుర్తించి అరెస్ట్ చేశారు.  గంజాయి స్వాధీనం చేసుకొని అతని వాహనాన్ని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని బంజారా హిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతనికి ఎవరి వద్ద నుంచి గంజాయి కొంటున్నాదో, ఎవరెవరికి గంజాయి సరఫరా చేస్తున్నాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అతని మొబైల్ ఫోన్లో కాంటాక్టులని పరిశీలిస్తున్నారు. 

Related Post