హిమాలయాలకు వెళ్ళక్కరలేదు... రవితేజ ఆఫీసుకు వెళ్తే చాలు!

January 11, 2026


img

కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం విడుదల కాబోతోంది. కనుక శనివారం హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ జరిగింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. “సినిమా ఆడిందా ఊడిందా?అని పట్టించుకోడు. మర్నాడు నుంచి షూటింగ్‌కి వెళ్ళిపోతాడు. 

శ్రీకృష్ణుడు భగవత్గీతలో చెప్పిన ఓ విషయం మీ అందరికీ అర్ధమయ్యే భాషలో వివరిస్తాను. బ్లాక్ బస్టర్స్ వచ్చినప్పుడు పొంగిపోకురా... సినిమా ఫ్లాప్ అయినప్పుడు క్రుంగిపోకురా అని చెప్పుకోవచ్చు. దీనినే స్థిత ప్రజ్ఞత అంటారు. 

రవితేజ భగవత్గీత చదివాడో లేదో తెలీదు. కానీ అతనిలో ఈ స్థిత ప్రజ్ఞత చాల ఉంది. కనుక ఫ్లాపులు వచ్చినప్పుడు క్రుంగిపోయి ఎవరూ హిమాలయాలకు వెళ్ళనవసరం లేదు. అలా ఓసారి రవితేజ ఆఫీసుకు వస్తే చాలు జ్ఞానోదయం చేస్తారు,” అని హరీష్ శంకర్ అన్నారు.

(Video Courtesy: Daily Culture)


Related Post

సినిమా స‌మీక్ష