మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ కి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ శనివారం జీవో జారీ చేసింది.
మొన్న రాజాసాబ్ సినిమాపై హైకోర్టుకి వెళ్ళి అడ్డుకున్న న్యాయవాది విజయ్ గోపాల్ మళ్ళీ నేడు ఈ సినిమాపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. కానీ ఇదేమీ అత్యవసరంగా విచారించాల్సిన కేసు కాదని హైకోర్టు తిరస్కరించడంతో సంక్రాంతి సెలవుల తర్వాత అంటే ఈ నెల 19న మళ్ళీ పిటిషన్ వేయనున్నారు.
అంతవరకు హైకోర్టు కలుగజేసుకోదని స్పష్టమైంది కనుక జీవో ప్రకారం ‘మన శంకర వరప్రసాద్ గారు’ టికెట్ ధరలు పెంచుకొని వసూలు చేసుకునే వెసులుబాటు లభించింది. కనుక మన ప్రసాద్ గారు అదృష్టవంతులే!
జీవో ప్రకారం జనవరి 11 రాత్రి 8 నుంచి 11 గంటల మద్య వేసే స్పెషల్ ప్రీమియర్ షోకి అదనంగా రూ.600, మర్నాటి నుంచి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీ స్క్రీన్ థియేటర్లలో రూ.100 (జీఎస్టీతో కలిపి) వసూలు చేసుకోవచ్చు.