సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీలో సొంతూర్లకు బయలుదేరుతున్న వారి వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి కిటకిటలాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నుంచి స్కూళ్ళకు సెలవులు ప్రకటించడంతో ఐటి ఉద్యోగులు నిన్న సాయంత్రం నుంచే కుటుంబ సభ్యులతో కలిసి సొంత వాహనాలలో ఊర్లకు బయలుదేరారు. ఈరోజు ఉదయం మరింత మంది బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ మద్య టోల్ ప్లాజాల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సంక్రాంతి పండుగకు టిజీఎస్ ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులు నడిపిస్తుండగా, ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థలు కూడా పోటాపోటీగా బస్సులు నడిపిస్తున్నాయి. కనుక అవన్నీ హైదరాబాద్ శివారులో ఎల్బీ నగర్ వద్ద నుంచి బయలుదేరుతుండటంతో అక్కడ కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. ఈ నెల 13 భోగీ, తర్వాత వరుసగా సంక్రాంతి, కనుమ, ముక్కనుమ పండుగలున్నాయి. కనుక అప్పటి వరకు ఈ రద్దీ ఇలాగే కొనసాగుతుంది. మళ్ళీ ఈ నెల 17,18 (శని,అదివారం) తిరుగు ప్రయాణాలు మొదలవుతాయి.