మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన

January 10, 2026


img

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడుతూ, “సినిమా టికెట్ ధరల పెంపుతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. పుష్ప-2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద ఆ ఘటన జరిగిన తర్వాత ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఎవరూ నా దగ్గరకు రావద్దని పదేపదే చెపుతున్నాను. కనుక నా దగ్గరకు ఎవరూ రాలేదు.

కనుక నేను ఏ సినిమాకి టికెట్ ధరల పెంపుకి అనుమతించలేదు. నిజం చెప్పాలంటే నేను సినీ పరిశ్రమని పట్టించుకోవడం మానేశాను. సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు, పేద కళాకారులు సాయం కోరి వస్తే వారి సమస్యలు పరిష్కరిస్తున్నాను. ఇంతకు మించి సినీ పరిశ్రమ నాకు ఎటువంటి సంబంధమూ లేదు,” అని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. 

రాజసాబ్ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునేందుకు హోంశాఖ కార్యదర్శి జీవో జారీ చేసినందుకు హైకోర్టు మొట్టికాయలు వేసి ఆ మెమోని రద్దు చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ‘మన శంకరవర ప్రసాద్ గారు’ కోసం జీవో జారీ చేసింది. దానిపై కూడా హైకోర్టులో పిటిషన్ పడింది.

ఈ తలనొప్పులు వద్దనే తాను ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.          



Related Post