మియాపూర్‌లో హైడ్రా ప్రభుత్వ భూములు స్వాధీనం

January 10, 2026
img

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో నేడు హైడ్రా దాదాపు రూ.3,000 కోట్లు విలువగల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. దీని కోసం భారీగా పోలీసులను, సిబ్బందిని, జేసీబీలను మోహరించింది.

తప్పుడు పత్రాలతో సర్వే నం.44లో అక్రమించుకొన్న భూములలో షెడ్లలను కూల్చివేసింది. ఇమ్రాన్ అనే వ్యక్తి నుంచి ఒకటిన్నర ఎకరాలు, దానిని ఆనుకొని ఉన్న మరో 5 ఎకరాలను స్వాధీనం చేసుకుంది.

మియాపూర్-బాచుపల్లి ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ భూములకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో కబ్జాదారుల కన్ను ఈ భూములపై పడి మెల్లమెల్లగా ఆక్రమించుకొని, చుట్టూ కాంపౌండ్ వాల్, లోన 18 పెద్ద షెడ్లు నిర్మించుకున్నారు.

వాటన్నిటినీ హైడ్రా సిబ్బంది కూల్చివేసి, ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్,  అవి ప్రభుత్వ భూములని బోర్డులు ఏర్పాటు చేసింది. ఇటీవల కాలంలో హైడ్రా నిర్వహించిన ఆపరేషన్లలో ఇదే అతిపెద్ద ఆపరేషన్.

Related Post