రాజాసాబ్ సినిమా టికెట్స్ పెంపు విషయంలో హైకోర్టు తీర్పు ప్రభావం సోమవారం విడుదల కాబోతున్న చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’పై కూడా పడటం ఖాయమే. కనుక తెలంగాణలో సినీ పరిశ్రమ ప్రేక్షుకులు, చిరంజీవి అభిమానులు సాధారణ టికెట్ ఛార్జీలతోనే ఈ సినిమా చూసే అవకాశం లభిస్తుంది.
పెద్ద సినిమాలకు ఈ టికెట్ల పెంపు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి కూడా పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పాలి. పెంచకపోతే కక్ష సాధింపు అంటారు. పెంచితే పెద్ద హీరోలు, నిర్మాతల సినీ పరిశ్రమ దోపిడీకి ప్రభుత్వం సహకరిస్తోందంటూ విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ పెంపు వలన ప్రభుత్వానికి పెద్దగా ఒరిగేదేమీ లేకపోయినా హైకోర్టులో మొట్టికాయలు కూడా తప్పడం లేదు. కనుక తెలంగాణ ప్రభుత్వం దీనిపై నిర్దిష్ట విధానం అవలభించి దానికే కట్టుబడి ఉండటం చాలా అవసరం.