పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు ఓ సూటి ప్రశ్న వేశారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీ అవినీతి, అక్రమాల గురించి కల్వకుంట్ల కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకనే మీ అవినీతి గురించి కొంచెం ప్రజలకు తెలిసింది. కానీ కల్వకుంట్ల కవిత జనంలోకి వచ్చాక ఎక్కడెక్కడ మీరు ఏవిధంగా అవినీతి, అక్రమాలకూ పాల్పడ్డారో వివిరించి చెపుతుంటే విని ప్రజలు షాక్ అవుతున్నారు.
కేసీఆర్‌కి సన్ స్ట్రోక్ తగిలి ఫామ్‌హౌసుకి పరిమితమైతే, కేటీఆర్‌కి సిస్టర్ స్ట్రోక్ తగులుతోంది ఇప్పుడు. మరి ఆయన పరిస్థితి ఎలా ఉంటుందోమీ పాలనే అసలైన రియల్ ఎస్టేట్ పాలనగా సాగింది. హైదరాబాద్‌లో వేసిన ప్రతీ పెద్ద వెంచర్‌లో కేటీఆర్‌కి వాటా ఉన్న మాట వాస్తవమా కాదా? చెప్పాలి. మీరు చెప్పకపోయినా వాటిని కొనుగోలు చేసిన ప్రజలకు తెలుసు.
కల్వకుంట్ల కవిత అడుగుతున్న ప్రశ్నలకు, చేస్తున్న ఆరోపణలకు సమాధానాలు చెప్పలేకపోతున్న మీరా మమ్మల్ని విమర్శించేది?” అని నిలదీశారు.
పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ రిబల్స్ వలన పార్టీకి కొంత నష్టం జరిగిన మాట వాస్తవమని కానీ జిహెచ్‌ఎంసి ఎన్నికలలో 90 శాతం సీట్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుచుకుంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.