రాజసాబ్ అంతా ఓకేనా?

January 11, 2026


img

మారుతి-ప్రభాస్‌ కాంబినేషన్‌లో భారీ అంచనాలతో విడుదలైన ‘రాజాసాబ్’ ఎలా ఉన్నారో సినిమా చూసిన ప్రేక్షకులకు తెలుసు. ఇంకా చూడనివారికి రాజాసాబ్ ఎలా ఉన్నారో రివ్యూలు చెప్పాయి.

కానీ దర్శకుడు మారుతి ఏమన్నారంటే, మా ‘రాజాసాబ్’ని చాలా మంది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. కానీ ‘రాజసాబ్’ కెపాసిటీ ఏమిటో తెలియాలంటే ఓ పది రోజులు ఓపిక పట్టండి,” అని అన్నారు.

కనుక ఓ పది రోజులు ఓపిక పడదామంటే ఎవరూ వినడం లేదు. అమెరికాలో నివసిస్తున్న స్వాతి బెల్లం అనే అభిమాని సకుటుంబ సమేతంగా టెక్సాస్‌లో రాజసాబ్‌ని చూసిన తర్వాత తన ఆలోచనలు సోషల్ మీడియాలో ఇలా పంచుకున్నారు.    

“నేను శుక్రవారం (అమెరికాలో రెండో రోజు) టెక్సాస్‌లోని ఒక పెద్ద థియేటర్‌లో ది రాజసాబ్‌  సినిమా చూశాను. థియేటర్‌లో మొత్తం 14 మంది మాత్రమే ఉన్నారు. అందులో 6 మంది మేమే. సినిమా ఘోరంగా ఉంటుందని ముందే అర్థమైంది. అందుకే మా కుటుంబం టిక్కెట్లు వదిలేసి థియేటర్‌కు వెళ్లకూడదేమో అని కూడా అనుకుంది. కానీ ప్రభాస్‌పై ప్రేమతో చివరకు వెళ్లాం.

అమెరికాలో 20 డాలర్లు వృథా కావడం కంటే, చెత్త సినిమా చూడటానికి 5 గంటలు ఖర్చు చేయడం ఇంకా బాధాకరం.

టిక్కెట్లు బుక్ చేసినప్పుడు పై రెండు వరుసలు పూర్తిగా ఫుల్‌గా కనిపించాయి. కానీ థియేటర్‌లో ఆ వరుసల్లో ఒక్కరూ లేరు. ఇది స్పష్టంగా బ్లాక్ బుకింగ్ అని చెప్పొచ్చు.

ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీకి అవమానం. సాధారణ సన్నివేశాల్లో కూడా వేరే వ్యక్తి శరీరానికి నకిలీ CGI ముఖం అంటించారు. సినిమా షూట్ చేయడానికి సరైన సమయం ఇవ్వలేకపోతే, ఇలాంటి సినిమా ఎందుకు తీయాలి?

ప్రభాస్‌కు శస్త్రచికిత్స జరిగిందని, డ్యాన్స్ చేయలేడని, రిస్కీ సీన్స్ చేయలేడని అంగీకరిస్తాను. కానీ నడవడానికి, నవ్వడానికి కూడా డూప్‌, CGI అవసరమా? అలా అయితే ఇంకొక నటుడిని ఎందుకు తీసుకోలేదు? 150 కోట్ల సినిమా తీసి, నటించడానికే ఆసక్తి లేకపోతే ఎలా?

మీరు ప్రేక్షకులను తక్కువగా చూస్తున్నారు. కానీ మీపై ప్రేమ ఉన్న వాళ్లే ఈ సినిమాను ఫ్లాప్ చేసి శిక్షిస్తారు.

చిరంజీవి కూడా గ్రీన్ స్క్రీన్‌తో చీప్ సినిమా చేయడానికి ప్రయత్నించి భోళా శంకర్తో భారీ ఫ్లాప్ చూశారు. గత ఏడాది రామ్ చరణ్, శంకర్ కూడా గేమ్ చేంజర్తో అదే తప్పు చేశారు. ది రాజసాబ్‌ డీ గ్రేడ్ సినిమా. ఇది చెత్త CGI కూడా కాదు.” 


Related Post

సినిమా స‌మీక్ష