ఏపీలో టీడీపి, జనసేన, బిజేపిల కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ తెలంగాణలో జనసేనతో పొత్తు అవసరం లేదని బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఏపీలో రాజకీయ పరిస్థితిని బట్టి అక్కడ మూడు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. కానీ తెలంగాణలో అటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో బిజేపి చాలా బలంగా ఉంది. కనుక త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేసి విజయం సాధించగలమనే నమ్మకం మాకుంది. ఇతర పార్టీలతో పొత్తులు లేదా మద్దతు విషయంలో మేము మా అధిష్టానానికి మా అభిప్రాయం తెలియజేస్తాము. ఈ విషయంలో మా అధిష్టానమే అంతిమ నిర్ణయం తీసుకుంటుంది,” అని రాంచందర్ రావు చెప్పారు.
జనసేన అధ్యక్షుడు, ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కొండగట్టు ఆంజనేయస్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు, మున్సిపల్ ఎన్నికలలో జనసేన పోటీ చేయడం గురించి పార్టీ శ్రేణులతో చర్చించారు. వారి అభిప్రాయం మేరకు పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.