మన శంకర వరప్రసాద్ గారు... ఎలా అలరిస్తారో?

January 11, 2026


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా చేసిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ ప్రీమియర్స్ మరికొద్ది సేపటిలో పడబోతున్నాయి. చాలా భారీ అంచనాల నడుమ విడుదలవుతున్నందున దీని రిజల్ట్ ఏవిధంగా ఉంటుందో అని సినీ పరిశ్రమ, అభిమానులు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రీమియర్ షో పూర్తయితే రిజల్ట్ వచ్చేస్తుంది.

అనిల్ రావిపూడి చాలా సింపుల్‌ కధలతో సినిమాలు తీసి ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఇది కూడా అలాంటిదే అని ముందే చెప్పేశారు. చిరంజీవి మార్క్ డాన్సులు, కామెడీ సీన్స్ ఎంత అద్భుతంగా ఉంటుందో అందరికీ తెలుసు. అనిల్ రావిపూడి ఈ సినిమాలో చిరంజీవిలో ఆ యాంగిల్స్ వాడుకుంటున్నారు.

కనుక సినిమా ఎలా ఉన్నా మినిమం గ్యారెంటీ ఉంటుందని చెప్పవచ్చు. దీనిలో వెంకీ మామని కూడా జోడించారు. కనుక వంద శాతం కామెడీ ఆశించవచ్చు. ఈ సినిమాలో హర్షవర్ధన్, అభినవ్ గోమటం, సచిన్ కేడ్కర్‌ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేశారు. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ సోమవారం ప్రపంచవ్యాప్తంగా చుట్టేయబోతున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష