రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్, సంయుక్త, సాక్షి వైద్య హీరో హీరోయిన్లుగా ‘నారి నారీ నడుమ మురారి’ సంక్రాంతి పండుగ రోజున అంటే 14 సాయంత్రం విడుదల కాబోతోంది. ఈరోజు సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
నరేష్, వెన్నెల కిషోర్, సునీల్, శ్రీవిష్ణు, సత్య ఆకెళ్ళ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. అందరూ కలిసి ట్రైలర్‌లో కామెడీ అదరగొట్టేశారు. దానికి చిన్న శాంపిల్: “నీ కొడుకు, నీ తమ్ముడు కలిసి ఆడుకుంటుంటే చూడాలని ఉందిరా అబ్బాయ్,” అంటూ రెండో పెళ్లి చేసుకున్న నరేష్ కొడుకు శర్వానంద్‌తో చెప్పిన డైలాగ్ చాలు.
ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం: రామ్ అబ్బరాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: జ్ఞాన శేఖర్, యువరాజ్ చేశారు.
ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, అడ్వంచర్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర కలిసి నిర్మించారు.