సిబీఐ మాజీ జాయింట్డైరెక్టర్ లక్ష్మినారాయణ ఇంటికే దొంగలు కన్నం వేసి రూ.2.58 కోట్లు కొట్టేశారు. ఇంటికంటే ఇంటికని కాదు. ఆయన ఇంటిఇల్లాలు ఊర్మిళకి సైబర్ క్రైమ్ నేరగాళ్ళు కుచ్చుటోపీ పెట్టి రూ.2.58 కోట్లు కొట్టేశారు.
స్టాక్ మార్కెట్‌లోతాము చెప్పిన కంపెనీలలో పెట్టుబడి పెడితే సులువుగా లాభాలు ఆర్జించవచ్చని సైబర్ నేరగాళ్ళునమ్మించారు. వారు చెప్పిన ప్రాఫిట్ గైడ్ అనే వాట్సప్ గ్రూపులో చేరారు.
ఇలాంటి అమాయకులని మోసగించడం కోసమే అటువంటి వాట్సప్గ్రూపులు సృష్టిస్తారనే విషయం తెలియని ఆమెకు ఆ ముఠాలో దినేష్ సింగ్ అనే ఒక వ్యక్తితాను కూడా ఆ గ్రూపు మెంబర్‌నని ఆమెతో పరిచయం చేసుకున్నాడు. తాను నిపుణుల సలహామేరకు పెట్టుబడితే 500 శాతం లాభం వచ్చిందని చెప్పాడు. నిదర్శనంగా కొన్ని స్క్రీన్ షాట్స్ పెట్టాడు.
తనకూ అలాగే భారీగా లాభాలు వచ్చాయంటూ ప్రియసఖి అనే ఆ ముఠాలో మరొకామె స్క్రీన్ షాట్స్ పెట్టింది. వాటినిచూసి నిజమని నమ్మిన లక్ష్మినారాయణ సతీమణి ఊర్మిళ, వారు సూచించిన MCKIEY CM అనే అప్లికేషన్‌ను యాపిల్యాప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకున్నారు.
దానిద్వారా డిసెంబర్ 24 నుంచి జనవరి 5 వరకు మొత్తం రూ.2.58కోట్లు పెట్టుబడి పెట్టారు. దీని కోసం ఆమె తన బంగారు నగలు తనఖా పెట్టారు. తర్వాత వారుచెప్పినట్లే తన ఖాతాలో భారీగా లాభాలు కనిపించడంతో ఆమె సంతోష పడ్డారు. కానీ దానిలో షేర్స్అమ్ముకొని పెట్టుబడి, లాభం వాపసు తీసుకునే ఆప్షన్ లేదని గుర్తించారు.
దాంతో తనకుఫోన్ చేసిన వ్యక్తికి ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. ప్రాఫిట్ గైడ్ వాట్సప్ గ్రూపుకూడా మాయం అయిపొయింది.తాను చాలా ఘోరంగా మోసపోయాననిఆమె గ్రహించారు.
ఈ విషయం భర్తకు తెలియజేయడంతో ఆయన వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకుపిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసుకొని నగదు ఏయే ఖాతాలకు బదిలీ అయ్యిందోకనుగొని ఫ్రీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.