ఈవారం ఓటీటీలో సినిమాలు... వెబ్‌ సిరీస్‌

August 08, 2022


img

గతవారం థియేటర్లలో విడుదలైన సీతారామం, బింబిసార రెండూ హిట్ అవడంతో తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ వారం థియేటర్లలో విడుదలయ్యే లాల్ సింగ్ చద్దా, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ మూడు సినిమాలు చాలా భారీ అంచనాలతో విడుదలవుతున్నాయి. కనుక ఇవి కూడా ప్రేక్షకులను రంజింపజేసి సినీ పరిశ్రమను నిలబెడతాయని అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. 

లాల్ సింగ్ చడ్డా: బాలీవుడ్‌ నటుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకుడు. ఈ సినిమాలో నాగ చైతన్య కూడా బాలరాజుగా నటించాడు. ఆగస్ట్ 11న ఈ సినిమా థియేటర్లలో విడుదలకాబోతోంది. 

మాచర్ల నియోజకవర్గం: ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా కృతిశెట్టి, కేథరిన్ నటించారు. ఇది నితిన్ మార్క్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఆగస్ట్ 12న థియేటర్లలో విడుదల కాబోతోంది.                

కార్తికేయ2: నిఖిల్ సూపర్ హిట్ మూవీ కార్తికేయకు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాను చందూ మొండేటి దర్శకత్వం వహించారు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు పాలించిన ద్వారకా నగరం చుట్టూ అల్లుకొన్న ఓ మిస్టరీ కధ ఇది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ఆగస్ట్ 13న థియేటర్లలో విడుదల కాబోతోంది.

ఈ వారం ఓటీటీలో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. 

నెట్‌ఫ్లిక్స్‌: హ్యాపీ బర్త్ డే (తెలుగు సినిమా) ఆగస్ట్ 8. 

డిస్నీ +హాట్ స్టార్: ది వారియర్ (తెలుగు సినిమా) ఆగస్ట్ 11

సోనీ లీవ్: గార్గి (తెలుగు, తమిళ్ సినిమా) ఆగస్ట్ 12. 

ఆహా: మహా మనిషి  (తెలుగు సినిమా) ఆగస్ట్ 12.

ఏజంట్ ఆనంద్ సంతోష్-4 (తెలుగు వెబ్‌ సిరీస్‌): ఆగస్ట్ 12. 

జీ5: హలో వరల్డ్ (తెలుగు వెబ్‌ సిరీస్‌): ఆగస్ట్ 12. 

అమెజాన్ ప్రైమ్: ది లాస్ట్ సిటీ (హాలీవుడ్ మూవీ) ఆగస్ట్ 10

సోనిక్ ది ఎడ్జ్ హాగ్ (హాలీవుడ్ మూవీ) ఆగస్ట్ 10. 


Related Post

సినిమా స‌మీక్ష