హలో వరల్డ్ ట్రైలర్‌ విడుదల

August 06, 2022


img

మెగా డాటర్ నీహారిక పెళ్లి తరువాత సినిమాలకు దూరమైనా సినీ, టీవీ రంగాలకు దూరం కాలేదు. ఇంతకు ముందు ఆమె జీ5తో కలిసి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మించారు. దానికి జీ5 ఓటీటీలో చక్కటి స్పందన వచ్చింది. మళ్ళీ తాజాగా శివసాయి వర్ధన్ దర్శకత్వంలో ‘హలో వరల్డ్’ అనే మరో వెబ్‌ సిరీస్‌ను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఎనిమిది ఎపిసోడ్లుగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆగస్ట్ 12 నుంచి జీ5లో ప్రసారం కానుంది. ఈ సందర్భంగా ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను దర్శకుడు హరీష్ శంకర్ నేడు విడుదల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆర్యన్ రాజేష్, సదా, రామ్ నితిన్ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ట్రైలర్‌ చాలా ఆకట్టుకొనేలా ఉంది. 

ఒక ఐ‌టి కంపెనీలో చేరిన 8 మంది యువత జీవితాలు ఏవిదంగా సాగుతాయనేది ఈ వెబ్‌ సిరీస్‌ కధాంశం అని దర్శకుడు శివసాయి వర్ధన్ తెలిపారు. ఈ వెబ్‌ సిరీస్‌కు సంగీతం పీకే దండి, కెమెరా: ఎదురోలు రాజు.  Related Post

సినిమా స‌మీక్ష