సాయి పల్లవి గార్గి ఓటీటీలోకి వచ్చేస్తోంది..

August 04, 2022


img

సాయి పల్లవికి సీరియస్ పాత్రలున్న సినిమాలే వరుసగా వస్తున్నాయి. శ్యామ్ సింగరాయ్ దాని తరువాత  విరాటపర్వం దాని తరువాత చేసిన గార్గి మూడూ అటువంటివే. అయినప్పటికీ సాయి పల్లవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. జూలై15న థియేటర్లలో విడుదలైన గార్గి ఈ నెల 12 నుంచి సోనీ లివ్‌లో ప్రసారం కాబోతోంది. సోనీలివ్ స్వయంగా ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించింది. ఈ సినిమా కధ చాలా విభిన్నమైంది. దీనిలో ఉపాధ్యాయురాలి పాత్రలో నటించిన సాయి పల్లవి ఒక అత్యాచారం కేసులో ఇరుకొన్న తండ్రిని న్యాయపోరాటం చేసి కాపాడుకొని ఆయనపై ఆ మచ్చను తొలగించడమే కధాంశం. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి చాలా అద్భుతంగా నటించింది. విరాటపర్వంలో సాయి పల్లవి నటనను కళ్ళారాచూసిన రానా ఈ సినిమాకు సమర్పకుడిగా ఉండాలని ఆమె కోరినవెంటనే అంగీకరించారు. ఆగస్ట్ 12 నుంచి సోనీలివ్‌లో తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమా ప్రసారం కానుంది.      Related Post

సినిమా స‌మీక్ష