షూటింగ్ కోసం వైజాగ్‌ చేరుకొన్న విజయ్

August 01, 2022


img

కోలీవుడ్ హీరో దళపతి విజయ్ తొలిసారిగా తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ కోసం విశాఖపట్నం చేరుకొన్నారు. తెలుగు, తమిళ్ భాషలలొ ఒకేసారి నిర్మితమవుతున్న ఈ సినిమా తమిళ్ వెర్షన్‌కు ‘వరిసు’అని ఖరారు చేయగా తెలుగులో ఇంకా ఖరారు చేయవలసి ఉంది. ఇది విజయ్‌ చేస్తున్న 66వ సినిమా కనుక ప్రస్తుతానికి #దళపతి66గా వ్యవహరిస్తున్నారు. ఈ తాజా షెడ్యూల్‌లో విశాఖ పరిసర ప్రాంతాలలో సుమారు 10-15 రోజులు షూటింగ్ జరుగబోతోంది.           

ఈ సినిమాలో విజయ్‌కి జంటగా రష్మిక మందన నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, జయసుధ, శరత్ కుమార్, ప్రభు, శ్రీకాంత్, సంగీత, సంయుక్త, యోగి బాబు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు, శిరీశ్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: థమన్, కెమెరా: కార్తీక్ ఫలని, ఎడిటింగ్: కెఎల్ ప్రవీణ్. 

వచ్చే ఏడాదిఓ జనవరిలో సంక్రాంతి పండుగకు ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పారు.


Related Post

సినిమా స‌మీక్ష