దసరా యాక్షన్ చిత్రం కాదు... రొమాంటిక్: శ్రీకాంత్ ఓదెల

July 27, 2022


img

దర్శకుడు సుకుమార్ ప్రియ శిష్యుడైన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేశ్ జంటగా చేస్తున్న సినిమా పేరు దసరా. ఈ సినిమాకు సంబందించి కొన్ని తాజా అప్‌డేట్స్ వచ్చాయి. ఈ సినిమాలో తొలిసారిగా నాని తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు. దర్శకుడు శ్రీకాంత్ నాని చేత పట్టుబట్టి ఈ రోల్ చేయిస్తున్నందున నాని కూడా తెలంగాణ యాసను బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సింగరేణి గనుల నేపధ్యంలో పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలోని ఓ పల్లెటూరులో ఈ సినిమా కధ సాగుతుంది. కొన్ని వారాల క్రితమే దసరా చిత్ర బృందం అక్కడ షూటింగ్ చేసింది.  

ఈ సినిమా పోస్టర్‌లో నాని గెటప్ చూసి ఇది యాక్షన్ సినిమా అని ప్రజలు అనుకొంటున్నారు. కానీ ఇది రొమాంటిక్ లవ్ స్టోరీ అని దర్శకుడు శ్రీకాంత్ చెప్పాడు. దీనిలో హీరో నిరుపేద. మురికివాడలో జీవిస్తుంటాడు. హీరోయిన్ కోటీశ్వరుడి కూతురు. వారి మద్య ప్రేమ ఎలా చిగురించింది? వారి ప్రేమ ఫలించిందా లేదా? అనేది కధాంశామని తెలుస్తోంది. 

శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో  సముద్రఖని, సాయి కుమార్, జారీనా వహేబ్ తడిటర్లు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: సత్యాన్ సూర్యన్, ఎడిటింగ్: నవీన్ నూలి. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను ‘నాటునాటు... నాటునాటు...’ అంటూ అద్భుతమైన డ్యాన్స్ చేయించిన ప్రేమ్ రక్షిత్ ఈ సినిమాకు కొరియోగ్రాఫర్‌. 


Related Post

సినిమా స‌మీక్ష