మీకు ఇదే పనా...వేరే పనేమీ లేదా?

June 21, 2022


img

నాగచైతన్య సమంతలు విడిపోయినప్పుడు కొంతకాలం వారి కోసం బాధపడిన వారి అభిమానులు, ఇప్పుడు వేర్వేరు గ్రూపులుగా మారి సోషల్ మీడియాలో యుద్ధం చేసుకొంటున్నారు. ఇటీవల నాగచైతన్య శోభితా దూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. అది సమంత పబ్లిక్ రిలేషన్స్ టీమ్‌ పుట్టించిన పుకార్లే అని చైతూ అభిమానులు అనుమానం వ్యక్తం చేశారు. 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే సమంత వెంటనే వాటిపై స్పందిస్తూ, “అమ్మాయిలపై పుకార్లు వస్తే అవి నిజమే అయ్యుంటాయి!! అదే అబ్బాయిలపై పుకార్లు వస్తే వాటిని ఆడపిల్లే సృష్టించి ఉండాలి!! ఇప్పటికైనా మీ ఆలోచన తీరు మార్చుకోండి గైస్.. దీనిలో సంబందిత వ్యక్తులు తమ పనులతో బిజీగా ఉంటున్నారు. మీరు కూడా ముందుకు సాగాలి. మీ ఉద్యోగాలు, మీ కుటుంబంపై దృష్టి పెడితే మంచిది,” అని బదులిచ్చింది. 

అంటే... విడిపోయిన మేమిద్దరం ఆ సంగతి ఎప్పుడో పక్కన పెట్టి మా సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాము. ఒకరి గురించి మరొకరు ఆలోచించే తీరిక లేదు. కానీ చైతు గురించి నేను ఏదో అన్నానని ఎవరో పుకార్లు పుట్టిస్తున్నారు. ఇటువంటి పనికిమాలిన పనులతో కాలక్షేపం చేసే బదులు మీ కెరీర్‌, మీ కుటుంబంపై శ్రద్ద చూపితే మంచిది కదా? అని సమంత చురకలు వేసినట్లు అర్దమవుతోంది. 

  Related Post

సినిమా స‌మీక్ష