కార్తికేయ-2 జూలై 22న విడుదల

June 20, 2022


img

యువహీరో నిఖిల్ హీరోగా 2014లో రిలీజ్ అయిన కార్తికేయ సూపర్ హిట్ అవడమే కాక నిర్మాతలకు భారీగా లాభాలు ఆర్జించిపెట్టింది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా కార్తికేయ-2తో జూలై 22న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటీవల విడుదలైన మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. కార్తికేయ-2 టీజర్‌ను జూన్‌ 22వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.  

చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న కార్తికేయ-2లో నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. ఇంకా రావు రమేష్, తనికెళ్ళ భరణి, బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్యా మీనన్, శ్రీనివాస్ రెడ్డి, స్వాతి రెడ్డి, హర్ష చేముదు తదితరులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.  

 పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషలతో పాటు హిందీలో కూడా విడుదల చేస్తున్నారు. కార్తికేయ-2కి కార్తీక్ ఘట్టమనేని కెమెరా, కాలభైరవ సంగీతం అందిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష