జీ5లో ఆర్ఆర్ఆర్‌ 20నే విడుదల కానీ...

May 16, 2022


img

రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై నేటికీ నిర్మాతలకు ఇంకా కలెక్షన్ల కనకవర్షం కురిపిస్తూనే ఉంది. మద్యలో ఆచార్య, సర్కారువారి పాట రిలీజ్ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈనెల 20 నుంచి ఆర్ఆర్ఆర్ జీ5 ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అయితే దానిలో కూడా ఫ్రీగా చూసేందుకు వీలుపడదు. వంద రూపాయలు అద్దె చెల్లిస్తే ఆ రోజు నుంచి వారం రోజులలోపుగా ఆ సినిమాను చూసేందుకు వీలుపడుతుంది. జీ5లో కొత్తగా సభ్యులుగా చేరదలిస్తే వార్షిక ఛార్జీ రూ. 599తో పాటు ఆర్ఆర్ఆర్ కోసం అదనంగా మరో వంద రూపాయలు చెల్లించాల్సిందే. అంత చెల్లించిన వారం రోజులలోపుగా చూడకపోతే మళ్ళీ మరో వంద అద్దె కడితే కానీ చూసేందుకు అవకాశం ఉండదు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.1,100 కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు నెలల తరువాత ఇప్పుడు ఓటీటీలో చూడాలన్నా మరో వంద కట్టక తప్పడం లేదు. Related Post

సినిమా స‌మీక్ష