సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌ సినిమా

May 13, 2022


img

పవన్ కళ్యాణ్‌ అభిమానులకు ఓ శుభవార్త! ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్‌ ఓ సినిమా చేయబోతున్నారు. ఈవిషయం ఆయనే స్వయంగా చెప్పారు. తమిళంలో తాను నటించి దర్శకత్వం వహించిన సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సీతాం’ను పవన్ కళ్యాణ్‌తో తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు తెలిపారు. తాను పవన్ కళ్యాణ్‌ అభిమానినని కనుక ఆ సినిమాను తన వంటి అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని తీయబోతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన పనులు జరుగుతున్నాయని త్వరలోనే పూర్తి వివరాలు తెలియజేస్తానని సముద్రఖని తెలిపారు. 

పవన్ కళ్యాణ్‌ భీమ్లా నాయక్ తరువాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు, దాని తరువాత హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్, దాని తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. వీటి తరువాత జె.పుల్లారావు జెబి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించబోయే సినిమాలు నటిస్తారు. కనుక సముద్రఖని-పవన్ కళ్యాణ్‌ల సినిమా షూటింగ్ మొదలవడానికి చాలా సమయం పట్టవచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష