గీతాగోవిందం నుంచి రాహుల్ ఇంకా బయటకి రాలేదా?

May 09, 2022


img

గీత గోవిందం సినిమాలో హీరో అర్జున్ రెడ్డికి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చి ఇబ్బందులలో పడేసిన రాహుల్ రామకృష్ణ నిజ జీవితంలో తన పెళ్ళి విషయంలో కూడా అలాగే  వ్యవహరిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన కాబోయే భార్యను లిప్ లాక్ పెట్టుకుంటూ తీసుకొన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి “ఈమే... నాకు కాబోయే భార్య...త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నామని,” చెప్పిన రాహుల్ ఆమె పేరు, వివరాలు చెప్పలేదు. దాంతో ఆమె పేరు బిందు అంటూ ఎవరో సోషల్ మీడియాలో పెట్టేశారు. అది చూసి రాహుల్ రామకృష్ణ మళ్ళీ క్లారిటీ ఇవ్వక తప్పలేదు. 

ఈరోజు మరో ట్వీట్ చేస్తూ తనకు కాబోయే భార్య పేరు బిందు కాదు హరిత అంటూ మెసేజ్ పెట్టాడు. అయితే ఇప్పటికీ ఆమె పూర్తి వివరాలు చెప్పలేదు కనుక రేపు ఆమె ఫలానా బిజినెస్ మ్యాన్ లేదా రాజకీయ నాయకుడి కుమార్తె...కాలేజీలో చదువుకునే రోజుల నుంచే వారిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో మరికొన్ని పుకార్లు పుట్టడం ఖాయం. అప్పుడు రాహుల్ ప్రతీరోజూ ఇలాగే వాటికీ వివరణ ఇచ్చుకోక తప్పదు. ఇలా రోజుకో కొత్త సమస్య తెచ్చుకునే బదులు తనకు కాబోయే భార్య వివరాలు తెలియజేస్తే బాగుంటుంది కదా?


Related Post

సినిమా స‌మీక్ష