అఖండ, సింగరాయ్ ఓటీటీలో విడుదలకు సిద్దం

January 18, 2022


img

బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ గత నెల విడుదలై నేటికీ విజయవంతంగా నడుస్తోంది. ఈ సినిమా జనవరి 21వ తేదీన డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కాబోతోంది. అలాగే నాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన శ్యామ్ సింగరాయ్ కూడా ఈనెల 21న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కాబోతోంది. అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప కూడా 5 భాషలలో ఇప్పటికే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. మంచి పాజిటివ్ టాక్‌ తెచ్చుకొన్న చిన్నాపెద్ద సినిమాలన్నీ ఒటీటీ ద్వారా ప్రజలందరికీ అనుబాటులోకి వస్తుండటం చాలా సంతోషకరమే.  Related Post

సినిమా స‌మీక్ష