తెలంగాణలో సినిమా టికెట్స్ ధరలు పెంపు

December 02, 2021


img

తెలంగాణలో సినిమా టికెట్స్ ధరలు రూ.50 చొప్పున పెరిగాయి. ప్రస్తుతం ఉన్న ధరలపై రూ.50 చొప్పున పెంచుకొనేందుకు హైకోర్టు అనుమతించడంతో నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. సినీ నిర్మాతలు చేసిన ఈ ప్రతిపాదనపై తెలంగాణ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కానీ అది ఇంతవరకు ఎటువంటి నిర్ణయమూ తీసుకోపోవడంతో నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే అన్ని చిత్రాలకు కాక కేవలం భారీ బడ్జెట్‌లతో రూపొందించిన చిత్రాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ ఈరోజు విడుదలయ్యింది. కనుక హైకోర్టు తాజా తీర్పుతో ఈ సినిమా నిర్మాతలకు ఊరట లభిస్తుంది.  Related Post

సినిమా స‌మీక్ష