సిరివెన్నెలకు ప్రముఖుల నివాళులు

December 01, 2021


img

ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికదేహాన్ని అభిమానుల సందర్శనార్ధం ఫిల్మ్ నగర్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచారు. ఫిల్మ్ ఛాంబర్‌లో ఆయనకు తెలుగు సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులు వచ్చి నివాళులు అర్పించారు. 

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, మురళీమోహన్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్, రావు రమేష్, నరేష్, నాని, రాణా, డాక్టర్ రాజశేఖర్ దంపతులు నివాళులు అర్పించారు. 

పరుచూరి గోపాల కృష్ణ, బుర్రా సాయి మాధవ్, సింగర్ సునీత, దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్, నాగ్ అశ్విన్, గుణశేఖర్, ఇంద్రగంటి మోహన కృష్ణ,  మారుతి, ఎస్వీ కృష్ణారెడ్డి సంగీత దర్శకులు మణిశర్మ, దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నిర్మాతలు డీవీవీ దానయ్య, అల్లు అరవింద్, దిల్‌ రాజు, అశ్వినీ దత్, సి.కళ్యాణ్, ఎంఎస్ రాజు తదితరులు ఛాంబర్‌లో ఆయనకు నివాలు అర్పించారు. 

ఇంకా పలువురు నటీనటులు, దర్శక నిర్మాతలు, సంగీత దర్శకులు, తెలుగు సినీ పరిశ్రమలో అన్ని విభాగాలకు చెందినవారు ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చి సిరివెన్నెలకు అశ్రువులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రతీ ఒక్కరూ ఆయనతో తమకున్న అనుబందాన్ని గుర్తు తెచ్చుకొని కన్నీళ్ళు పెట్టుకొన్నారు. 

సినీ పరిశ్రమలో వారే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు కూడా ఛాంబర్‌కు వచ్చి సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రులు హరీష్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని హాజరయ్యి నివాళులు అర్పించారు. టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ కూడా ఛాంబర్‌కు వచ్చి సిరివెన్నెలకు నివాళులు అర్పించారు.               

ఏపీ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇద్దరూ సిరివెన్నెల మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి సిరివెన్నెల అంతిమయాత్ర ప్రారంభమైంది. దారిపొడవునా ప్రజలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఆయన భౌతిక కాయానికి చేతులు జోడించి దణ్ణం పెడుతూ నివాళులు ఆర్పిస్తున్నారు. మరికొద్ది సేపటిలో మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆయన దహనసంస్కారాలు జరుగనున్నాయి.


Related Post

సినిమా స‌మీక్ష