ఈమె ఎవరో గుర్తుపట్టారా?

November 24, 2021


img

అవును... ఈ ఫోటోలో ఉన్నది ఎప్పుడూ నిండుగా హుందాగా చిర్నవ్వుతో కనపడే మన జయసుదే కానీ మొహంలో ఆ కళ లేదిప్పుడు. గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్న ఆమె ఇటీవల ట్విట్టర్‌లో ‘స్మైల్.. ఇట్స్ ఫ్రీ థెరపీ’ అంటూ తన తాజా ఫోటో పెట్టారు. అది చూసి ఆమె అభిమానులు షాక్ అయ్యుంటారు. ఆమె ఏదైనా చికిత్స కోసం అమెరికా వెళ్ళారా? లేదా బరువు తగ్గడానికి అమెరికాలో ఏదైనా చికిత్స తీసుకొంటున్నారా? ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయం మళ్ళీ ఆమే స్వయంగా తెలియజేస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. 


సుమారు ముప్పై సంవత్సరాలపాటు  అగ్రనేతలందరితో హీరోయిన్‌గా అనేక సినిమాలు చేసిన జయసుధ, సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అక్క, వదిన, తల్లి పాత్రలలో నటిస్తూ అందరినీ మెప్పించేరు. కానీ మహర్షి సినిమా తరువాత ఆమె పెద్దగా సినిమాలలో కనిపించడం లేదు. ఇప్పుడు హటాత్తుగా జయసుధను ఈవిదంగా చూడటం ఆమే అభిమానులకు కొంచెం కష్టమే. కానీ ఆమె ఆరోగ్యంగా ఉంటూ మళ్ళీ సినిమాలలో నటిస్తే చాలు అని అందరూ కోరుకొంటున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష