డిసెంబర్‌ 26న అనుభవించు రాజా

November 22, 2021


img

యువనటుడు రాజ్‌ తరుణ్, కషిష్ ఖాన్ జంటగా నటించిన ‘అనుభవించు రాజా’ డిసెంబర్‌ 26వ తేదీన విడుదలకాబోతోంది. రోమాంటిక్, కామెడీగా వస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మించారు. శ్రీను గవిరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అజయ్, అబ్దుల్ కలాం నరేన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకు గోపి సురేందర్ సంగీతం అందించగా నగేశ్ భనెల్ సినిమాటోగ్రాఫర్‌గా చేశాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ చాలా ఆకట్టుకొనేలా ఉంది. 

ఒక పల్లెటూరిలో కింగ్‌లాగా ఓ వెలుగు వెలిగిన ఓ కుర్రాడు, నగరానికి వచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరడం, అక్కడే ఓ సాఫ్ట్‌వేర్‌ అమ్మాయితో ప్రేమలో పడటం, మళ్ళీ గ్రామానికి వెళ్ళి ప్రెసిడెంటుగా పోటీ చేయడం వంటివి చూస్తే దర్శకుడు శ్రీను గవిరెడ్డి పల్లెటూరు బ్యాక్ డ్రాప్‌తో కధ అల్లుకొని మంచి కామెడీ పండించడానికి వస్తునట్లున్నాడు. ట్రైలర్‌లో రాజ్‌ తరుణ్ కూడా 100 పర్సంట్ కామెడీకి గ్యారంటీ ఇస్తున్నట్లే ఉన్నాడు. అవునో కాదో మీరే చూడండి.   Related Post

సినిమా స‌మీక్ష