పుష్ప నాలుగో సాంగ్ వచ్చేసింది

November 20, 2021


img

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటిస్తున్న పుష్ప సినిమాలోని నాలుగో సాంగ్ లిరికల్‌ వీడియో రిలీజ్ అయ్యింది. ‘ఆ పక్కా నాదే...ఈ పక్కా నాదే... తలపై ఆకాశం ముక్కా నాదే...’అంటూ  సాగిన సాంగ్ అభిమానుల అంచనాలకు మించే ఉందని చెప్పవచ్చు. సాంగ్ లిరికల్‌ వీడియో ఇంత అద్భుతంగా ఉంటే దానికి అల్లు అర్జున్ ఎటువంటి స్టెప్స్ వేశాడో ఊహించుకొంటేనే అభిమానులు థ్రిల్ అవకామానరు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇప్పటివరకు బాహుబలి సినిమా ఒక్కటే రెండు పార్టులుగా విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తొలిసారిగా అల్లు అర్జున్ చేస్తున్న ఈ పుష్ప సినిమా కూడా రెండు పార్టులుగా విడుదలవుతుండటంతో అభిమానుల ఆనందానికి అవధులే లేవు. మొదటిపార్ట్ ‘పుష్ప: ద రైజ్’ డిసెంబర్‌లో 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. పుష్ప సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ బాషలలో రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి చాలా భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. Related Post

సినిమా స‌మీక్ష