2022లో ఇండియా షేక్ అవుతుందన్న రౌడీ హీరో..!

October 23, 2021


img

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్ గా మారాయి. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న లైగర్ సినిమా 2022లో ఇండియాను షేక్ చేస్తుందని చెప్పాడు. పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన రొమాంటిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు. 

రొమాంటిక్ ఈవెంట్ లో ఆకాష్ పూరీ ఈ సినిమాతో హిట్ కొట్టాలని విజయ్ దేవరకొండ కోరుకున్నారు. ఇక లైగర్ సినిమా గురించి మాత్రం మాస్ అప్డేట్ ఇచ్చారు. తన రౌడీ ఫ్యాన్స్ కు లైగర్ సినిమా చూసి ఇండియా షేక్ అవుతుందని అన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ చెప్పింది చూస్తుంటే నిజంగానే పూరీ లైగర్ ను ఆ రేంజ్ లో తీస్తున్నాడని అర్ధమవుతుంది. సినిమాలో మైక్ టైసన్ కూడా నటించడం సినిమాపై అంచనాలు పెంచాయిRelated Post

సినిమా స‌మీక్ష