ఆరెక్స్ హీరోతో మెంటల్ బ్యూటీ..!

October 23, 2021


img

యువ హీరో కార్తికేయ ఆరెక్స్ 100 హిట్ తర్వాత ఆడియెన్స్ లో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నా ఆ తర్వాత ఆరెక్స్ 100 లాంటి హిట్ ఒక్కటి పడలేదని చెప్పాలి. వరుసగా సినిమాలైతే చేస్తున్నా సరే కార్తికేయకు లక్ కలిసి రావట్లేదు. ప్రస్తుతం శ్రీ సరిపల్లి డైరక్షన్ లో రాజా విక్రమార్క సినిమా చేస్తున్న కార్తికేయ ఈ సినిమా తర్వాత మరోసారి నూతన దర్శకుడితో మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మెంటల్ మదిలో భామ నివేదా పేతురాజ్ ను సెలెక్ట్ చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే హీరోయిన్ కు కథ వినిపించి ఓకే చేయించుకున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది.

మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో.. పాగల్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరించిన నివేదా పేతురాజ్ యువ హీరో కార్తికేయతో జత కడుతుంది. కార్తికేయ, నివేదా జోడీ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష