బాలయ్య బాబు మంచి మనసు..!

October 23, 2021


img

నందమూరి నట సింహం బాలకృష్ణ త్వరలో ఓటీటీ షోకి హోస్ట్ గా కనిపించనున్నారన్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ కోసం బాలయ్య బాబు అన్ స్టాపబుల్ షో చేస్తున్నాడు. ఇన్నాళ్లు సినిమాలతో అలరించిన బాలకృష్ణ ఒక షోకి హోస్ట్ గా కనిపించడం ఇదే మొదటిసారి. ఇక ఈ షో హోస్ట్ గా బాలకృష్ణ చేస్తున్నందుకు గాను భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అన్ స్టాపబుల్ షో కోసం బాలకృష్ణకు దాదాపు 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నారట. 

అయితే ఈ షో ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం బాలకృష్ణ పలు సంస్థలకు డొనేట్ చేస్తున్నారని తెలుస్తుంది. తన ఆధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సల్ హాస్పిటల్ తో పాటుగా మరికొన్ని స్వచ్చంధ సంస్థలకు బాలకృష్ణ ఈ రెమ్యునరేసన్ విరాళం గా అందిస్తారని తెలుస్తుంది. ఈ విషయం తెలిసిన నందమూరి ఫ్యాన్స్.. సినీ ప్రేక్షకులు బాలయ్య మంచి మనసుకి ఫిదా అవుతున్నారు.Related Post

సినిమా స‌మీక్ష