ఆ ఛానళ్ల పై సమంత పరువునష్టం దావా..!

October 20, 2021


img

నాగ చైతన్య, సమంత డైవర్స్ కు కారణాలు ఏంటన్న విషయాలపై మీడియా ఛానళ్లు రకరకాల కథనాలు ప్రసారం చేశాయి. అయితే కొన్ని యూట్యూబ్ ఛానళ్లు మాత్రం సమంత.. చైతన్య విడిపోవడానికి కారణం సమంత కాస్టూం స్టైలిస్ట్ ప్రీతం జుకల్కర్ అని కథనాలు అల్లారు. చైతు, సమంత సెపరేట్ అవుతున్నామని చెబుతూ తమకు కొంత ప్రైవసీ కావాలని చెప్పినా మీడియా ఛానళ్లు మాత్రం సమంత గురించి రకరకాల కథనాలు రాసింది. 

అయితే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సమంత లేటెస్ట్ గా తనపై ఇంకా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న 3 యూట్యూబ్ ఛానళ్ల మీద కేసు ఫైల్ చేసింది. మూడు యూట్యూబ్ ఛానళ్ల మీద సమంత పరువు నష్టం దావా వేసింది. కూకట్ పల్లీ కోర్ట్ లో సమంత పరువు నష్టం దావా వేసింది. తన విడాకుల మీద యూట్యూబ్ ఛానెల్స్ అసత్య ప్రచారం చేశాయని సమంత పిటీషన్ లో పేర్కొన్నారు. Related Post

సినిమా స‌మీక్ష