సలార్ లో మలయాళ స్టార్..!

October 20, 2021


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమాలో మరో స్టార్ హీరో నటిస్తున్నట్టు తెలుస్తుంది. కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న సలార్ సినిమాలో ప్రభాస్ తో పాటుగా మళయాళ స్టార్ పృధ్విరాజ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సినిమాలో అతను నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడని టాక్. కె.జి.ఎఫ్ 2 ని పూర్తి చేసే పనిలో ఉన్న ప్రశాంత్ నీల్ త్వరలోనే సలార్ నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తాడని తెలుస్తుంది.

ప్రభాస్ సలార్ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కె.జి.ఎఫ్ హీరోయిన్ నిధి శెట్టి కూడా స్పెషల్ సాంగ్ లో కనబడనున్నదని చెబుతున్నారు. కె.జి.ఎఫ్ రేంజ్ కు ఏమాత్రం తగ్గకుండా ఆ సినిమాకు మించి సలార్ ఉంటుందని టాక్. మొదట్లో సలార్ సినిమాను 2022 ఏప్రిల్ రిలీజ్ అనుకున్నా ఇప్పుడు ఆ టైం కు కె.జి.ఎఫ్ 2 ని రిలీజ్ ప్లాన్ చేశారు. Related Post

సినిమా స‌మీక్ష