100% ఆక్యుపెన్సీ.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..!

October 13, 2021


img

కరోనా వల్ల ఇన్నాళ్లు ఏపీలో 50 శాతం మాత్రమే సీటింగ్ కెపాసిటీని ఏపీ ప్రభుత్వం అనుమతించింది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరచుకున్నా సరే 50 పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే ఇన్నాళ్లు థియేటర్లు నడిపించారు. ఏపీలో కరోనా మార్గదర్శకాల సవరించిన నేపథ్యంలో సినిమా హాళ్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇచ్చారు. రోజులు నాలుగు ఆట ప్రదర్శనలపై కూడా ఆంక్షలు ఎత్తివేశారు. 

తెలంగాణాలో ఎప్పటినుండో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ పర్మిట్ ఉండగా ఇన్నాళ్లకు ఏపీ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 14 నుండి ఏపీలో 100 శాతం సీటింగ్ తో ప్రదర్శనలకు పర్మిషన్ ఇచ్చారు. దసరా సందర్భంగా ఏపీ సినీ ప్రియులకు ఇదో మంచి శుభవార్త అని చెప్పొచ్చు. దసరా బరిలో వస్తున్న శర్వానంద్, సిద్ధార్థ్ ల మహా సముద్రం.. అఖిల్ బ్యాచిలర్.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వస్తున్న పెళ్లిసందD సినిమాలకు ఏపీలో 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ దొరుకుతుంది.Related Post

సినిమా స‌మీక్ష