బాలయ్య హోస్ట్.. మెగాస్టార్ గెస్ట్..!

October 12, 2021


img

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో ఒక టాక్ షో వస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలంతా తాము చేస్తున్న సినిమాలతో పాటుగా టాక్ షోస్, యాడ్స్, రియాలిటీ షోస్ ఇలా చేస్తున్నారు. అయితే వారికి తాను ఏమాత్రం తక్కువ కాదు అనేలా బాలయ్య బాబు ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆహాలో బాలయ్య హోస్ట్ గా ఓ క్రేజీ టాక్ షో ప్లాన్ చేశారు. ఈ టాక్ షోలో మొదటి గెస్ట్ గా మంచు ఫ్యామిలీ రాబోతుందని తెలుస్తుంది. 

మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మి ఈ షోలో పాల్గొంటారని తెలుస్తుంది. ఇక స్పెషల్ ఎపిసోడ్ గా మెగాస్టార్ చిరంజీవితో కూడా బాలయ్య ఎపిసోడ్ ఒకటి ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య హోస్ట్ గా చిరంజీవి గెస్ట్ గా ఈ టాక్ షో రానుంది. ఇది నిజంగా మెగా నందమూరి ఫ్యాన్స్ కు పండుగ చేసుకునే న్యూస్ అని చెప్పొచ్చు. వేరే విషయాల్లో ఎడబాటులు ఎంత ఉన్నా సినిమా.. ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం వారి దూరాన్ని పక్కన పెట్టి స్టార్స్ అంతా కలిసి ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుంటారు. సో బాలకృష్ణ టాక్ షోలో చిరు గెస్ట్ గా వచ్చి ఎలాంటి సందడి చేస్తారో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష