'మా' నామినేషన్స్ షురూ..!

September 27, 2021


img

అక్టోబర్ 10న జరుగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ లో భాగంగా నామినేషన్స్ మొదలు అయ్యాయి. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ తో పాటుగా వచ్చి నామినేషన్స్ వేశారు. ప్రతి విషయంలో తాము ఒక అడుగు ముందే ఉన్నాం.. ఇవి ఎన్నికలు కాదు పోటీ మాత్రమే.. గెలిపించేది.. ఓడించేది ఓటర్లే. అక్టోబర్ 3న మా ఎన్నికల ప్రణాళిక చెబుతామని అన్నారు ప్రకాష్ రాజ్. మా ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దని అన్నారు. దూషారోపణలు లేకుండా ఎన్నికలు జరగాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు. మంచి నాయకుడు. దేశం కోసం పోరాడుతున్నాడు. ఆయనకంటూ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. పవన్ కూడా మా అసోసియేషన్ మెంబరే. ఎవరు ఏం చెప్పినా మంచి కోసమే మాట్లాడతారు. పవన్ చేసిన వ్యాఖ్యలు.. వచ్చే ప్రతిఫలం బట్టి ముందు వెళ్దామని అన్నారు ప్రకాష్ రాజ్. ఈ ప్యానెల్ లక్ష్యం మా అభ్యుదయం కోసం పనిచేయడమే అని అన్నారు.  

మరోపక్క జనరల్ సెక్రెటరీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న బండ్ల గణేష్ కూడా నామినేషన్ వేశారు. తన వెనుక చాలా పెద్ద వాళ్లు ఉన్నారని. తన గెలుపు ఖాయమని అన్నారు బండ్ల గణేష్. ఇక మా బిల్డింగ్ కల్లా పేద కళాకారులకు ఇల్లు అవసరమని. జూబ్లీ హిల్స్ లో కన్నా కోకాపేట లో ప్రభుత్వాన్ని భూమి ఇవ్వమని అడిగి.. అక్కడ వారిక్ 100 ఇల్లు కట్టిస్తే బాగుంటుందని అన్నారు బండ్ల గణేష్. మన హీరోలు ఎక్కడికి వెళ్లనవసరం లేదు గచ్చి బౌలిలో ఈవెంట్ చేస్తే డబ్బులు వస్తాయని అన్నారు. ఎలక్షన్స్ లో తాను రాకెట్ లా దూసుకెళ్తానని అన్నారు బండ్ల గణేష్. మా ఎలక్షన్స్ లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సీనియర్ నటుడు సి.వి.ఎల్ నరసింహా రావు కూడా ఈరోజు నామినేషన్ వేశారు.Related Post

సినిమా స‌మీక్ష