సోనూసూద్ ఇల్లు, ఆఫీస్ ల పై ఐడీ దాడులు..!

September 15, 2021


img

ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ ఇల్లు, ఆఫీస్ లపై ఐటీ దాడులు నిర్వహించారు, ముంబై, లఖనవూలోని ఆయన కంపెనీల పై ఈ సోదాలు జరిగినట్టు సమాచారం. ఆదాయపు పన్నుకు సంబందించిన అవకతవకలు వచ్చాయన్న ఆరోపణలతో ఈ సోదాలు జరిపినట్టు తెలుస్తుంది. అనూహ్యంగా సోనూ సూద్ పై ఐటీ దాడులు మరోసారి ఆయన రాజకీయ ప్రవేశం తెరపైకి వచ్చేలా చేశాయి. అంతకుముందే ప్రజాసేవ చేసేందుకు రాజకీయం ఒక్కటే దారి కాదని సోనూ సూద్ అన్నారు. 

ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశ్ కే మెంటర్స్ కార్యక్రమానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్కూల్ స్టూడెంట్స్ ను ఆయన గైడ్ చేయనున్నారు. ఆ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటమే ఈ ఐడీ దాడులకు కారణమని కొందరు చర్చించుకుంటున్నారు. అయితే తన ఇల్లు, ఆఫీస్ లపై జరిగిన సోదాల గురించి సోనూ సూద్ వివరణ ఇవ్వాల్సి ఉంది.Related Post

సినిమా స‌మీక్ష